యాదాద్రి వార్షిక ఆదాయం రూ.94 కోట్లు

పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నర్సింహ స్వామి దేవస్థాన 2018-19 ఆర్థిక సంవత్సర ఆదాయ, వ్యయ వివరాలు ప్రకటించారు ఆలయ అధికారులు. ఈ ఏడాది 93 కోట్ల 96 లక్షల 91 వేల ఆదాయం సమకూరిందన్నారు ఆలయ అధికారులు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 5 కోట్ల 60 లక్షల ఆదాయం అదనంగా సమకూరిందని తెలిపారు. యాదాద్రి క్షేత్ర పునర్నిర్మాణంలో భాగంగా గత నాలుగు సంవత్సరాల నుంచి బాలాలయంలోనే దర్శనాలు కల్పిస్తున్నారు. స్వామి వారి స్వయంభూ దర్శనాలు ప్రారంభమైతే ఆదాయం మరింత పెరుగుతుందంటున్నారు అధికారులు

 

Latest Updates