కుమారస్వామి.. యెడ్యూరప్పల మధ్య పవర్ వార్

yeddyurappa Audio Tapes Leaked by Kumaraswamy

yeddyurappa Audio Tapes Leaked by Kumaraswamyకర్ణాటకలో అధికార-విపక్షాల మధ్య పవర్ వార్ ఆగడం లేదు. ఈ సారి ఏకంగా మోడీని టార్గెట్ చేశారు సీఎం కుమారస్వామి. పథకం ప్రకారమే మోడీ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మోడీ.. ఓవైపు నీతులు చెబుతూ.. బ్లాక్ మనీతో ప్రజాస్వామ్యాన్ని కూల్చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తమ MLA లను కొనడానికి బీజేపీ ప్రయత్నిస్తోందంటూ ఆడియో టేప్ లు రిలీజ్ చేశారు కుమారస్వామి. జేడీఎస్ ఎమ్మెల్యే నాగన్నగౌడ కుమారుడితో యెడ్యూరప్ప మాట్లాడిన ఆడియో క్లిప్ విడుదల చేశారు.

కుమారస్వామికి కౌంటరిచ్చారు యెడ్యూరప్ప. ఆరోపణలు నిరూపిస్తే అన్ని పదవులకు రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అధికారం కోసం కుమారస్వామి ఎంతకైనా తెగిస్తారనడానికి ఇదే నిదర్శనమన్నారు. విపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్న కుమారస్వామికి సీఎంగా ఉండే హక్కు లేదన్నారు యెడ్యూరప్ప. మొన్నటి దాకా ప్రభుత్వంతో ఉండి.. ఇప్పుడు దూరంగా ఉంటున్న నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయాలని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ను కోరారు మాజీ సీఎం సిద్ధరామయ్య. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రమేష్, మహేశ్, నాగేంద్ర, ఉమేష్ లకు.. మూడు సార్లు నోటీస్ ఇచ్చినా.. విప్ జారీ చేసినా సభకు రాలేదని.. సిద్ధరామయ్య మండిపడ్డారు.

ఇక.. బీజేపీలోకి వెళ్లిపోతారని ప్రచారం జరిగిన.. రాయచూర్ ఎమ్మెల్యే బసనగౌడ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ కు హాజరయ్యారు. తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని.. అందుకే సభకు వచ్చానని చెప్పారు. జేడీఎస్ ఎమ్మెల్యే నారాయణ గౌడ.. అసెంబ్లీకి హాజరు కాలేదు. అయితే.. ఫుడ్ పాయిజన్ కారణంగా హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యానని అందుకే రావడం లేదని.. కుమారస్వామికి సమాచారమిచ్చారు.

Latest Updates