వెంకీ మామను ప్రేమలో పడేసిన టీచరమ్మ

వెంకటేష్, నాగచైతన్య కాంబోలో తెరకెక్కుతున్న సినిమా వెంకీమామ. వీరికి జోడిగా పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నా నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. కొన్ని రోజుల క్రితం వెంకీమామ టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఆ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా వెంకటేష్, పాయల్ రాజ్‌పుత్‌ల ‘ఎన్నాళ్లకో’ లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పాటను చూస్తుంటే పెళ్లే వద్దనుకున్న వ్యక్తి.. ఇప్పుడు ప్రేమలో పడితే ఎలా ఉంటుందో చెప్పే విధంగా ఈ పాట సాగుతుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 13న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

Latest Updates