కేరళలో మంచోడు

నందమూరి కల్యాణ్‌రామ్‌, మెహరీన్‌ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘ఎంత మంచివాడవురా’.  సతీష్‌ వేగేశ్న దర్శకుడు. శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పణలో ఉమేష్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి రేసుకు సిద్ధమవుతోంది.  చివరి షెడ్యూలు త్వరలో ప్రారంభం కానున్న సందర్భంగా  ఉమేష్‌ గుప్తా,  కృష్ణ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘అన్ని  వర్గాల ప్రేక్షకులకీ నచ్చే  అంశాలున్నాయి. ఆఖరి షెడ్యూల్‌ని కేరళలోని మున్నార్‌ వంటి సుందరమైన ప్రదేశాల్లో ఈ నెల 31 నుంచి నవంబర్‌ 10 వరకూ చేస్తాం.  రెండు పాటలు, కీలకమైన సీన్స్ చిత్రీకరిస్తాం. రాజు సుందరం నృత్య దర్శకత్వంలో హీరో హీరోయిన్లపై ఒక పాటను… కల్యాణ్‌రామ్‌, మెహరీన్, సుహాసిని, శరత్‌బాబు, వెన్నెల కిశోర్‌ తదితరులపై రఘు మాస్టర్‌ నేతృత్వంలో మరో పాటను షూట్‌ చేస్తాం. ఈ నెలాఖరు నుంచి డబ్బింగ్‌ కార్యక్రమాలూ మొదలుపెడతాం. జనవరి 15న రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం’ అని తెలిపారు.  టీజర్‌‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని, కళ్యాణ్‌ రామ్‌ని సరికొత్త కోణంలో చూపించే చిత్రమని దర్శకుడు చెప్పాడు.

Latest Updates