పాతాళభైరవి శిల్పి రంగారావు కన్నుమూత

హైదరాబాద్, వెలుగు: నాటి తరం తెలుగు సినిమా డైరెక్టర్, నిర్మాత యెర్నేని రంగారావు (89) కన్నుమూశారు. ఏపీలోని కృష్ణాజిల్లా గుజరలో బుధవారం పొద్దున ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. 20 ఏళ్ల వయసులో మౌల్డర్, పెయింటర్ గా సినిమా రంగంలో అడుగుపెట్టిన రంగారావు పాతాళభైరవి సినిమాలో పాతాళభైరవి విగ్రహం తయారీలో పనిచేశారు. తర్వాత ప్రఖ్యాత డైరెక్టర్లు హెచ్.ఎం.రెడ్డి, కేవీరెడ్డి దగ్గర అసిస్టెండ్ డైరెక్టర్ గా పనిచేశారు. కొంత అనుభవం సంపాదించాక బాపు ఫిలిమ్స్ పేరుతో సొంత బ్యానర్ స్థాపించారు. 1963లో ఎన్టీఆర్, షావుకారు జానకితో సవతికొడుకు సినిమాను నిర్మించడంతో పాటు డైరెక్షన్ చేశారు. 1990లో అమెరికా వెళ్లిపోయిన రంగారావు పదేండ్ల పాటు వందలాది పెయింటింగ్ లు, విగ్రహాలను రూపొందించి న్యూయార్క్, న్యూజెర్సీల్లో ప్రదర్శనలు నిర్వహించారు. 2000లో ఆయనకు అమెరికా పౌరసత్వం వచ్చినా 2002లో స్వదేశానికి తిరిగొచ్చి సొంత ఊర్లోనే ఉంటున్నారు.

Latest Updates