యెస్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ RTGS సేవలు రీస్టార్ట్‌‌

న్యూఢిల్లీ: బ్యాంక్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌వార్డ్‌‌‌‌‌‌‌‌ రియల్‌‌‌‌‌‌‌‌టైమ్‌‌‌‌‌‌‌‌ గ్రాస్‌‌‌‌‌‌‌‌ సెటిల్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ సర్వీసులు(ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీజీఎస్‌‌‌‌‌‌‌‌) అందుబాటులోకి వచ్చాయని యెస్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ బుధవారం ప్రకటించింది. దీంతో  కస్టమర్లు క్రెడిట్‌‌‌‌‌‌‌‌ కార్డ్‌‌‌‌‌‌‌‌ బకాయిలు, లోన్లను ఇతర అకౌంట్ల నుంచి యెస్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌కు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీజీఎస్‌‌‌‌‌‌‌‌ ద్వారా చేసుకోవచ్చని తెలిపింది. కాగా మంగళవారం యెస్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌వార్డ్‌‌‌‌‌‌‌‌ ఐఎంపీఎస్‌‌‌‌‌‌‌‌, నెఫ్ట్‌‌‌‌‌‌‌‌ సేవలను కూడా కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది.  రెండు రూ. లక్షల కంటే ఎక్కువ అమౌంట్‌‌‌‌‌‌‌‌ను చెల్లించాలంటే ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీజీఎస్‌‌‌‌‌‌‌‌ను ఉపయోగిస్తారు.  ఈ అమౌంట్‌‌‌‌‌‌‌‌ కంటే తక్కువ ఉంటే నెఫ్ట్‌‌‌‌‌‌‌‌ను ఉపయోగించుకోవచ్చు. వీటితో పాటు లోన్‌‌‌‌‌‌‌‌, క్రెడిట్‌‌‌‌‌‌‌‌ కార్డ్స్‌‌‌‌‌‌‌‌ చెల్లింపులను ఇతర బ్యాంక్‌‌‌‌‌‌‌‌ అకౌంట్ల నుంచి ఐఎంపీఎస్‌‌‌‌‌‌‌‌ ద్వారా చేసుకోవచ్చు.

యెస్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ అప్పులు సురక్షితమే: రిలయన్స్​

యెస్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ నుంచి తీసుకున్న మొత్తం అప్పును తిరిగి చెల్లిస్తామని అనిల్‌‌‌‌‌‌‌‌ అంబానీకి చెందిన రిలయన్స్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌ బుధవారం తెలిపింది. బ్యాంక్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన అప్పులకు ఎటువంటి ఢోకా లేదని పేర్కొంది. ఆస్తులను అమ్మడం ద్వారా యెస్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన అప్పులన్నింటిని తిరిగి చెల్లిస్తామని పేర్కొంది. అంతేకాకుండా యెస్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ ఫౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాణా కపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కాని, ఆయన ఫ్యామిలీతో కానీ రిలయన్స్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌కు ఎటువంటి ఎక్స్‌‌‌‌‌‌‌‌పోజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదని కంపెనీ తెలిపింది.

 

Latest Updates