అవును నేను పాకిస్తానీనే: ఆధిర్‌ రంజన్‌

భారతదేశం ప్రధాని మోడీ, అమిత్‌షాల వ్యక్తిగత ఆస్తి కాదన్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఆధిర్‌ రంజన్‌ చౌదరి. కేంద్రంలోని అధికార బీజేపీ సిటిజెన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌ (CAA), నేషనల్‌ రిజిస్టర్‌ ఫర్‌ సిటిజెన్స్‌ (NRC) లను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు అమలు చేస్తామంటూనే ఉండండి..మేం వ్యతిరేకిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. అంతేకాదు తాను పాకిస్తానీనని..బీజేపీ వాళ్లు ఏం చేసుకోవాలంటే అది చేసుకోండని సవాల్ చేశారు. మీకు ఏ ఒక్కరూ భయపడరన్నారు. ఢిల్లీలో కూర్చున్న రంగా, బిల్లా  ఏదో ఒకటి అంటూ ఉంటారని ఆరోపించారు. మీరు చేసేవాటన్నింటినీ మేం ఆమోదించాలి… లేదంటే మాపై దేశద్రోహులని ముద్ర వేస్తారా అని ప్రశ్నించారు ఆధిర్‌.

Latest Updates