అవును..తెలంగాణలో కల్వకుంట్ల ప్రభుత్వమే: తలసాని

తెలంగాణలో కల్వకుంట్ల ప్రభుత్వమే ఉందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బీజేపీ అధ్యక్షుడి లక్ష్మణ్ కు ఎందుకు అనుమానం అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం నడుస్తుందని.. కాబట్టి రాష్ట్రం ఇలా అభివృద్ధి చెందుతుందన్నారు. MIM దేశంలో ఉన్న రాజకీయ పార్టీనే కదా.. రాజకీయంగా MIMతో బీజేపీ పోరాటం చేస్తే మేము వద్దన్నమా అన్నారు. మాట్లాడితే కేసీఆర్ కుటుంబం మీద పడుతున్నారని.. కేసీఆర్ కుటుంబం ఏమైనా నామినేటెడ్ అయ్యి వచ్చారా.. ప్రజలతోనే ఎన్నిక కాబడ్డారు కదా అన్నారు. వెంకటస్వామిని గౌరవించి ట్యాంక్ బండ్ దగ్గర విగ్రహం పెట్టామని.. బీజేపీలో చేరిన వివేక్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ DPR ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిన అవసరం లేదన్న తలసాని.. DPR ప్రశ్నకు సమాదానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అప్పు అప్పు అంటున్నారు.. కేంద్ర ప్రభుత్వం అప్పు చేయలేదా అన్నారు. ఎంత అప్పు చేసినా కట్టే స్థోమత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పారు. బీజేపీ ఎవరిని చేర్చుకున్నా మాకు అభ్యంతరం లేదన్నారు. రాష్ట్రంలో ఎవరు ప్రత్యామ్నాయమో తేల్చుకోండన్న ఆయన.. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు TRSలోకి వస్తే.. ఎదో తప్పు చేసినట్లు బీజేపీ మాట్లాడుతుందన్నారు. పలు రాష్ట్రాల్లో కూడా వేరే పార్టీ ఎమ్మెల్యేలను కూడా బీజేపీ చేర్చుకుంటుంది. మరి దానికి బీజేపీ ఏమి సమాధానం చెబుతుందన్నారు.

MIMతో పోరాటం చేయడం బీజేపీకి సాధ్యం కాదన్న మంత్రి.. MIM- TRS దోస్తీని బూచిగా చూపించి బీజేపీ ప్రజలను రెచ్చగొడుతోందన్నారు. పుల్వామా దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వానికి MIM మద్దతు తెలపలేదా…. బీజేపీ ఇంత వరకు ఒక్క గుడినైనా కట్టిందా అన్నారు. TRS ప్రభుత్వం హాయంలో యాదాద్రి కడుతున్నామని తెలిపిన తలసాని..యాగాలు, హోమాలు చేయడం కూడా బీజేపీకి చేతకాదు. మేం చేస్తున్నాం అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంట్ భవనాన్ని కడతామంటే తప్పని సరిగా మద్దతునిస్తామని చెప్పారు తలసాని శ్రీనివాస్ యాదవ్.

Latest Updates