యోగి నీకు సీఎంగా కొనసాగే హక్కులేదు..పదవికి రాజీనామ చేయ్ : ప్రియాంక గాంధీ

ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాద్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ.

గ్యాంగ్ రేప్ కేసులో మరణించిన బాధితురాలి అంత్యక్రియల్ని ఇంట్లో కుటుంబ సభ్యుల్ని నిర్భందించి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంగా యోగి ఆధిత్యనాథ్ కొనసాగే నైతిక హక్కు లేదన్నారు.

ఆమె మరణం గురించి తెలుసుకొని తన తండ్రి కాల్ చేసినట్లు తెలిపారు. ఫోన్ మాట్లాడే సమయంలో బాధితురాలి తండ్రి నిరాశతో వేసిన కేకల్ని తాను మరిచిపోలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

నా బిడ్డకు న్యాయం చేయాలని బాధితురాలి తండ్రి తనతో అన్నారని, తన కుమార్తె డెడ్ బాడీ ఇంటికి తీసుకొచ్చిన వెంటనే..కడసారిగా చూసే అవకాశం లేకుండా మానవ హక్కుల్ని కోల్పోయేలా పోలీసుల నిర్భందంలో అంత్యక్రియలు చేయడం ఏంటని ట్వీట్ చేశారు.

గత రాత్రి జరిగిన భయానక సంఘటనలో యూపీ పోలీసులు  పోలీసులు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీ నుంచి బాధితురాలి డెడ్ బాడీని యూపీ హత్రాస్ కు తీసుకొచ్చి తల్లిదండ్రులకు ఇవ్వకుండా ఆమె దహనసంస్కారాల్ని నిర్వహించారని ట్వీట్ లో పేర్కొన్నారు.  ఆమె కుటుంబాన్ని బంధించి, బంధువులు మరియు గ్రామస్తులను భారీ కేడ్లతో నియంత్రించారని ప్రియాంక గాంధీ ఆరోపించారు.

Latest Updates