గూగుల్‌‌‌‌ను ఇవి కూడా అడగొచ్చు

మొబైల్ వాడకం పెరిగాక మనుషులు మధ్య మాటలు తగ్గాయి. ఏ చిన్న విషయం అడగాలన్నా టక్కున మొబైల్ తీసి గూగుల్‌‌ని అడిగేస్తున్నారు. ఎందుకంటే.. ఈ రోజుల్లో మన కన్నా మన మొబైల్ ఫోన్ ఎంతో స్మార్ట్‌‌గా తయారైంది. ఆన్‌‌లైన్‌‌లో అన్ని పనులు చేసి పెట్టడంతో పాటు మనతో మాట్లాడుతూ మనకు కావాల్సిని వివరాలు కూడా చెప్తుంది. గూగుల్‌‌లో ఏది సెర్చ్ చేయాలన్నా.. వెంటనే ‘ఓకే గూగుల్’ అంటున్నారు. అయితే ఈ గూగుల్ అసిస్టెంట్ గురించి చాలామందికి పూర్తిగా తెలీదు. గూగుల్ అసిస్టెంట్‌‌లో మనకు తెలియని కొన్ని కొత్త టెక్నిక్స్ ఏంటంటే.. ట్రాన్స్ లేటర్‌‌‌‌గా…

గూగుల్ అసిస్టెంట్‌‌ను వేరే భాషలో మాట్లాడ్డానికి ట్రాన్స్‌‌లేటర్‌‌‌‌గా ఉండమని అడగొచ్చు. దీన్నే ‘ఇంటర్‌‌‌‌ప్రిటర్ మోడ్’ అంటారు. ఈ మోడ్‌‌లోకి ఎంటర్ అయిన వెంటనే.. ఏ భాషలో మాట్లాడుతున్నారో .. దాన్ని ఏ భాషలోకి అనువదించాలో సెలెక్ట్ చేసుకోవాలి. గూగుల్‌‌ను ట్రాన్స్ లేటర్‌‌‌‌గా మార్చాలంటే.. ముందు ‘ఓకే గూగుల్’ అన్న తర్వాత.. ‘ఇంటర్‌‌‌‌ప్రిట్ మోడ్ ఆన్’ అన్న కమాండ్ ఇవ్వాలి. తర్వాత స్క్రీన్ మీద ఏ భాష మాట్లాడతారు, దాన్ని ఏ భాషలోకి అనువదించాలో ఆప్షన్స్ వస్తాయి. అందులో కావల్సింది సెలక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకు తెలుగు నుంచి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే.. తెలుగులో మాట్లాడితే ఇంగ్లీష్‌‌లోకి మార్చి చూపిస్తుంది. ‘ఎలా ఉన్నావు’ అని అడిగితే.. ‘హౌ ఆర్ యూ’ అని గూగుల్ అంటుంది. ఇలా గూగుల్‌‌లో అందుబాటులో ఉన్న భాషలన్నింటికి ఈ ఫీచర్ అప్లై అవుతుంది.

చూసి చెప్పేస్తుంది

గూగుల్ అసిస్టెంట్ లాగానే ‘గూగుల్ లెన్స్’ అనే అప్లికేషన్ కూడా ఉంది. గూగుల్ అసిస్టెంట్.. వాయిస్ ద్వారా విని ఎలా పనిచేస్తుందో… గూగుల్ లెన్స్ కెమెరా ద్వారా చూసి పని చేస్తుందన్న మాట. అంటే గూగుల్ లెన్స్ ద్వారా ఏదైనా వస్తువుని ఫొటో తీస్తే.. ఆ వస్తువు వివరాలన్నీ గూగుల్‌‌లో సెర్చ్ చేసి, చెప్పేస్తుంది. ఉదాహరణకు రోడ్డుమీద ఒక కొత్తరకం కారు కనిపిస్తే.. గూగుల్ లెన్స్ ద్వారా ఆ కారు మోడల్ వివరాలన్నీ తెలుసుకోవచ్చు. గూగుల్ లెన్స్ ఓపెన్ చేసి.. కారుని ఫొటో తీస్తే.. వెంటనే ఆ కారు పేరు, మోడల్, ఇతర వివరాలన్ని చెప్పేస్తుంది. ఈ యాప్ ఆండ్రాయిడ్ 5.0 పైన వర్షన్‌‌లన్నింటిలో పని చేస్తుంది.

సరిగా పనిచేయకపోతే..

చాలామంది మొబైల్ లాక్ ఓపెన్ చేసి, గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ చేస్తేనే అది పనిచేస్తుందనుకుంటారు. కానీ కాదు. గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఎప్పుడూ యాక్టివ్‌‌లోనే ఉంటుంది. మొబైల్ లాక్ ఓపెన్ చేయకుండా ‘ఓకే గూగుల్’ అంటే చాలు. వాయిస్ అసిస్టెంట్ ఆన్ అవుతుంది. అయితే దానికోసం ఫోన్‌‌లో గూగుల్ అసిస్టెంట్ ఎనేబుల్ చేయాలి. ఒకవేళ ఇది ఎనేబుల్ అయి ఉన్నా రాకపోతే.. వాయిస్ క‌‌మాండ్ ఫీచ‌‌ర్ డిజేబుల్‌‌గా ఉందేమో చూసుకోవాలి. గూగుల్ అసిస్టెంట్ సెట్టింగ్స్‌‌లో ఫోన్‌‌ను క్లిక్ చేసి గూగుల్ అసిస్టెంట్ ఎనేబుల్ చేస్తే.. ఎప్పుడు ‘గూగుల్’ అని పిలిచినా పలుకుతుంది. కాకపోతే మొబైల్‌‌లో ఇంటర్నెట్ యాక్టివ్‌‌గా ఉండాలి. గూగుల్ అసిస్టెంట్‌‌లో డిఫాల్ట్‌‌గా అమెరిక‌‌న్ ఇంగ్లీష్ ఉంటుంది. దీన్ని మన లాంగ్వేజ్‌‌లోకి మార్చుకోవాలంటే సెట్టింగ్స్‌‌లోకి వెళ్లి సెర్చ్ లాంగ్వేజ్ మీద క్లిక్ చేయాలి. అందులో ప్రిఫ‌‌రెన్స్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే దాని కింద ఉండే ‘ఆఫ్‌‌లైన్ స్పీచ్ రికగ్నిషన్‌‌’ను క్లిక్ చేసి, నచ్చిన లాంగ్వేజ్‌‌ని డౌన్‌‌లోడ్ చేసుకుంటే… ఇంట‌‌ర్నెట్ క‌‌నెక్షన్ లేకుండానే వాయిస్ అసిస్టెంట్‌‌ను వాడుకోవ‌‌చ్చు.

ఓకే గూగుల్ క‌‌మాండ్ బాగా ప‌‌నిచేయాలంటే ఫోన్‌‌లో మైక్రోఫోన్ బాగా ప‌‌నిచేయాలి. ఫోన్ ఛార్జ్ చేసే పాయింట్ ద‌‌గ్గర చిన్నగా క‌‌నిపించే రంధ్రమే మైక్రోఫోన్. మైక్రో ఫోన్‌‌లో డస్ట్ ఉండి సరిగా పనిచేయకపోతే గూగుల్ అసిస్టెంట్ కూడా సరిగా పనిచేయదు. ఇచ్చిన కమాండ్స్‌‌ని సరిగా అర్థం చేసుకోలేదు. అందుకే చిన్న పిన్‌‌తో మైక్రోఫోన్ దగ్గర అప్పుడప్పుడు క్లీన్ చేస్తుండాలి. వీటితో పాటు మొబైల్‌‌లో వేరే ఇతర వాయిస్ కమాండ్ యాప్స్ ఎనేబుల్‌‌లో ఉన్నా.. గూగుల్ అసిస్టెంట్ పనిచేయదు.అలాగే గూగుల్, గూగుల్ అసిస్టెంట్ యాప్‌‌లు ఎప్పటికప్పుడు అప్‌‌డేట్ చేస్తూ ఉండాలి. బ్యాక్‌‌గ్రౌండ్‌‌లో న‌‌డుస్తున్న యాప్స్ క్లోజ్ చేసి గూగుల్ వాయిస్‌‌ను ఓపెన్ చేస్తే ఇంకా బెటర్‌‌‌‌గా పని చేస్తుంది.

ఇల్లీగల్ ఓల్డేజ్ హోమ్స్

Latest Updates