కంగన ఆఫీస్‌‌‌ను కూల్చారు.. దావూద్ ఇంటిని కూల్చలేదేం?

ఉద్ధవ్ ఠాక్రేకు ఫడ్నవీస్ ప్రశ్న

ముంబై: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ విషయంలో శివ సేన వ్యవహరిస్తున్న తీరుపై మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబైలోని కంగనా ఆఫీసు కూల్చివేతకు ఆదేశించిన సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. అదే బొంబాయిలోని అండర్‌‌‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఇంటిని మాత్రం ఎందుకు కూల్చలేదని ఫడ్నవీస్ ప్రశ్నించారు. కంగనాకు మహారాష్ట్ర సర్కార్‌‌‌కు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం నేపథ్యంలో బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) కంగనా ఆఫీసును అక్రమ కట్టడమంటూ కూల్చేసిన సంగతి తెలిసిందే. అయితే బీఎంసీ చర్యలతో రాష్ట్ర సర్కార్‌‌‌కు ఎలాంటి సంబంధం లేదని కంగనాతో డైలాగ్ వార్‌‌లో కీలకంగా ఉన్న శివ సేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. అలాగే తమ పార్టీలో కంగనా వివాదం ముగిసిందన్నారు.

Latest Updates