బ్యాంక్ ఉద్యోగం రాలేద‌ని యువతి ఆత్మహత్య

కరీంనగర్, వెలుగు: క‌రీంన‌గ‌ర్ లో విషాద ఘ‌ట‌న జ‌రిగింది. స్థానిక రామ్ న‌గ‌ర్ లో నివాస‌ముంటున్న దుర్శెట్టి సుష్మ ( 26) అనే ‌యువ‌తి ఉరి వేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఎన్ని సార్లు ప్ర‌య‌త్నించినా బ్యాంక్ ఉద్యోగం రాలేద‌న్న మ‌న‌స్తాపంతో గురువారం బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది.
రాజ‌న్న ‌ సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం కొదురుపాక గ్రామానికి చెందిన సుష్మ 2015 లో ఎంబీఏ పూర్తి చేసింది. కొంతకాలంగా ఇక్కడే కరీంనగర్ లోనే ఉంటూ బ్యాంక్ పరీక్షల కోసం సన్నద్ధమ‌వుతోంది. అయితే ఎంత‌ ప్రయత్నించినా.. ఉద్యోగం రాలేద‌న్న దిగులుతో ఉరి వేసుకొని చనిపోయింది. ఆమె మ‌ర‌ణంతో కుటుంబ‌స‌భ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

hand on table

Latest Updates