యువతిని కొబ్బరి తోటలో నరికి చంపిన ప్రేమోన్మాది

Young Girl Mahitha Was Murdered in Yalamanchili

తూర్పు గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజగొప్పులో ప్రేమోన్మాది ఓ యువతిని కొబ్బరి తోటలో హత్య చేశాడు. మృతురాలిని మహితగా, హంతకుడిని మహేష్‌గా గుర్తించారు పోలీసులు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు దారితీసి ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. భీమవరం మండలం బేతపూడికి చెందిన మహిత కాకినాడలో ఇంటర్ వరకు చదివింది. గత నాలుగు నెలలుగా చెరువు గట్టు ప్రాంతంలోని మేనమామ ఇంట్లో నివాసం ఉంటోంది. ఇదే క్రమంలో నెల రోజుల క్రితం నుంచి మహేష్ అనే డ్రైవర్ తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య పరిచయం మరింత సాన్నిహిత్యానికి దారి తీసినట్టు సమాచారం. మహేష్ మహితతకు రూ.2 లక్షల వరకు ఇచ్చినట్టు తెలుస్తోంది.

అయితే ఇటీవల మహిత మహేష్ ను దూరం పెట్టడంతో తీవ్రంగా నొచ్చుకున్నాడు. మహేష్‌కు ఇదివరకే వివాహమైనట్టు సమాచారం. అయితే కొన్నాళ్లుగా భార్యకు దూరంగా ఉంటున్న మహేష్ మహితకు చాలా దగ్గరైనట్టు తెలుస్తోంది. ఈ సోమవారం స్నేహితులతో కలిసి యలమంచిలికి వచ్చిన మహేష్… మహితను కొబ్బరి తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ మాటా మాటా పెరిగి ఇద్దరి మధ్య వాగ్వాదం ముదిరింది. చివరకు వెంట తెచ్చుకున్న కత్తితో మహితపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. అయితే మహితను ఇంత దారుణంగా ఎందుకు హత్య చేశాడన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Latest Updates