యంగ్ ఇండియా సవాళ్లను అధిగమిస్తుంది: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: యంగ్ ఇండియా ఫుల్ ట్యాలెంట్‌తో నిండి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చుకున్నారు. యంగ్ ఇండియా ఇన్నోవేటివ్, క్రియేటివ్ సొల్యూషన్స్‌తో దేశ సమస్యలను తీరుస్తుందన్నారు. చిన్నపాటి గైడెన్స్‌తో కరోనా మహమ్మారితోపాటు ప్రపంచవ్యాప్తంగా కొత్తగా ఏదైనా కొత్త ఆరోగ్య విపత్తులు ఏర్పడినా పరిష్కారం చూపుతారని చెప్పారు. స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్ 2020 గ్రాండ్ ఫినాలేలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని మోడీ పాల్గొన్నారు.

‘కరోనా లాంటి విషమ పరిస్థితుల్లో హ్యాకథాన్‌ను నిర్వహించడం చాలా పెద్ద సవాల్‌. ఇన్ని చాలెంజ్‌ల మధ్య కూడా ఇది జరగడం అద్భుతమే. అందుకు కారణమైన పార్టిసిపెంట్స్‌తోపాటు ఆర్గనైజర్స్‌కు శుభాకాంక్షలు చెబుతున్నా’ అని మోడీ చెప్పారు. ఈ యేడు నిర్వహించిన హ్యాకథాన్‌లో 10 వేల మంది స్టూడెంట్స్‌ పాల్గొన్నారు. హెచ్‌ఆర్‌‌డీ మినిస్ట్రీకి చెందిన ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఈసీటీఈ) హ్యాకథాన్‌ను ఆర్గనైజ్ చేసింది.

Latest Updates