మా అమ్మకు పెళ్లి.. ఈ గుణాలతో వరుడు కావలెను: కూతురి ట్వీట్

45 – 55 మధ్య వయసు ఉండాలి

నాన్ వెజ్, మద్యం తీసుకోకూడదు

3న సాయంత్రం క్లారిఫికేషన్ ఇస్తూ మళ్లీ ట్వీట్

గోప్యతను బ్రేక్ చేయనందుకు మీడియాకు థ్యాంక్స్

పెళ్లి కొడుకు కావాలంటూ ఓ యువతి ఇచ్చిన ప్రకటన ట్విట్టర్ ను ఊపేస్తోంది. వేల మంది లైకులు, రీట్వీట్లు, రిప్లైస్ తో అదరగొట్టేస్తున్నారు. అమ్మాయి వరుడి కోసం చూడడం రొటీనే కదా! అలాంటి వాటికి కుర్రకారు రెస్పాండ్ అవడం కూడా కొత్తేముందీ! ఇదేగా ఎవరికైనా అనిపించే ఫీలింగ్!

కానీ ఇంత స్పెషల్ గా చెప్పాల్సివచ్చిందంటే ఏంటీ? అక్కడే ఉంది ట్విస్ట్! ఆ అమ్మాయి పెళ్లి కొడుకు కోసం ప్రకటన ఇచ్చింది తన కోసం కాదు.. తనను కని, పెంచిన తల్లి కోసం!!

ఆస్తా వర్మ అనే యువతి. లా స్టూడెంట్. తన తండ్రి ఎలా దూరమయ్యాడన్న విషయం చెప్పలేదు. కానీ, ఈ బిజీ లైఫ్ లో తల్లికి మంచి తోడునివ్వాలన్న కోరికతో తల్లితో సెల్ఫీ తీసుకుని ఆ ఫొటోను పోస్ట్ చేసింది. ‘మా అమ్మ కోసం 50ఏళ్ల వరుడు కావాలి’ అంటూ అక్టోబర్ 31న రాత్రి ట్వీట్ చేసిందామె. మంచి అందగాడు, వెజిటేరియన్ అయ్యుండాలి, మద్యం తాగకూడదు, మంచిగా సెలిట్ అయిన వ్యక్తి కావాలి అంటూ షరతులతో ట్వీట్ చేసింది. గ్రూమ్ హంటింగ్ అనే హ్యాష్ ట్యాగ్ తో చేసిన ట్వీట్ ను ఆదివారం సాయంత్రానికి 31 వేల మంది లైక్ కొట్టారు. 6500 మంది రీట్వీట్ చేశారు. 6600 మంది కామెంట్లు చేశారు.

రాహుల్ గాంధీ ఫొటోతో కొందరు హాస్యం పలికించే ప్రయత్నం చేస్తే.. మరికొందరు ఆమె చెప్పిన కండిషన్లతో సూట్ అయ్యే వరుడి ఫొటోలను పోస్ట్ చేశారు. ఇంకొందరైతే ఆస్తాకు ప్రపోజ్ చేశారు. కొందరు మాత్రం అమ్మకు మంచి తోడు ఇవ్వడం కోసం నీ ప్రయత్నం సూపర్ అంటూ మెచ్చుకున్నారు.

క్లారిఫికేషన్స్

ఆదివారం సాయంత్రం మళ్లీ మరో రెండు ట్వీట్లతో ఆస్తా వర్మ చిన్న క్లారిఫికేషన్ తో పాటు థ్యాంక్స్ చెప్పింది. తన తల్లి ఒక టీచర్ అని, బాగా చదువుకున్న వ్యక్తి అని వివరించింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆమెకు సరిపోయే సజెషన్స్ మాత్రమే ఇవ్వాలని కోరింది. 45-55 మధ్య వయసుంటే ఓకే అని చెప్పిందామె. అలా కాదంటే ఎవరూ మెసేజ్ చేయొద్దని, కొంతమంది సెటైర్లు వేస్తూ మెమ్స్ చేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని చెప్పింది.

మీడియాకు థ్యాంక్స్

తన ట్వీట్ పట్ల చాలా మంది చూపిన ప్రేమ, సపోర్ట్ కు థ్యాంక్స్ చెప్పింది ఆస్తా వర్మ. అలాగే తన వివరాలు బయటపెట్టకుండా, గోప్యతను గౌరవిస్తూనే సపోర్టింగ్ కథనాలు వేసినందుకు మీడియాకు ధన్యవాదాలు చెప్పింది.

Latest Updates