క్షుద్రపూజలతో అర్ధరాత్రి హల్ చల్

young-man-arrested-by-doing-demonic-activities-in-hydearabad

హైదరాబాద్: అర్ధరాత్రి తన ఇంట్లో క్షుద్రపూజలు చేస్తూ స్థానికులను భయాందోళనలకు గురి చేశాడో యువకుడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హసన్ నగర్ లో జరిగింది.  హసన్ నగర్ కు చెందిన జామీల్ అనే యువకుడు అర్ధరాత్రి దాటిన తరువాత మాంసాన్ని ముక్కులు ముక్కలుగా కొడుతూ పెద్ద పెద్ద శబ్ధాలు చేసి స్థానికులను భయబ్రాంతులకు గురి చేశాడు. ఆ శబ్ధాలు విని కాలనీవాసులు.. అర్థరాత్రి  ఏం చేస్తున్నావని ప్రశ్నించగా శాంతి పూజలు చేస్తున్నానంటూ బదులిచ్చాడు. దీంతో అనుమానం వచ్చిన చుట్టు ప్రక్కల వారు అతడిని రాజేంద్ర నగర్ పోలీసులకు పట్టించారు.

Latest Updates