పోలీస్ స్టేషన్ ముందు యువకుడి ఆత్మాహత్యాయత్నం

పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఓ యువకుడు పెట్రోల్ పోసుకున్న ఘటన చాంద్రాయణగుట్టలో జరిగింది. చాంద్రాయణగుట్టకు చెందిన పాత నేరస్థుడు షబ్బీర్ ను ఆ ప్రాంత సీఐ రుద్ర భాస్కర్ సెల్ ఫోన్ దొంగతనం కేసు విషయంలో పిలిపించారు. విచారణ పేరుతో సీఐ రుద్ర భాస్కర్ తనను వేధిస్తున్నాడని షబ్బీర్ పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు.. మంటలు ఆర్పి తీవ్రంగా గాయపడిన షబ్బీర్ ని ఆస్పత్రికి తరలించారు. షబ్బీర్ ను కాపాడే ప్రయత్నంలో చాంద్రాయణగుట్ట అదనపు సీఐ ప్రసాద్ వర్మతో పాటు మరో కానిస్టేబుల్ కి స్వల్ప గాయాలయ్యాయి. షబ్బీర్ గతంలో నాలుగు కేసులకు సంబంధించి జైలు శిక్ష అనుభవించాడు.

For More News..

సెక్రటేరియట్‌ను కూలుస్తున్నది మూఢనమ్మకంతోనే

కేసీఆర్.. జగన్‌తో ‌‌‌కుమ్మక్కయ్యావా?

మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ మృతి

Latest Updates