అప్పులు తీర్చడం కోసం ఆన్‌లైన్ గేమ్.. మళ్లీ అప్పులు కావడంతో సూసైడ్

వనస్థలిపురంలో దారుణం జరిగింది. ఆన్‌లైన్ గేమ్‌తో అప్పులపాలైన జగదీష్(33) అనే యువకుడు సెల్ఫీ వీడియో తీసుకొని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జగదీష్ స్థానికంగా ఉంటూ.. ఓ డయాగ్నోస్టిక్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. అయితే జగదీష్ గతంలోనే అప్పులు చేసి ఇబ్బందుల్లో ఉంటే ఆయన తండ్రి 12 లక్షల అప్పు తీర్చాడు. అయినా ఇంకా అప్పు తీరకపోవడంతో.. మిగతా అప్పు తీర్చేందుకు జగదీష్ మరోసారి ఆన్‌లైన్ గేమ్ ఆడి నష్టపోయాడు. మళ్లీ అప్పులు పెరగడంతో క్షమించండి అంటూ తండ్రి, భార్యకు సెల్ఫీ వీడియోలు పంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జగదీష్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

For More News..

ఆరు నెలలకు సరిపడా రేషన్‌తో నిరసనకు వచ్చిన రైతులు

వీడియో: నా మీదే పోటీచేస్తావా.. డివిజన్‌లో నీకు జాగా లేకుండా చేస్తా..

బాలీవుడ్‌లోకి ప్రభాస్ ఛత్రపతి.. హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Latest Updates