టిక్ టాక్ కోసం చెరువులో దిగి.. శవంగా తేలాడు

young-man-dead-in-a-pond-while-recording-a-tiktok-video

టిక్ టాక్ సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. చెరువులో దిగి టిక్ టాక్ యాప్ ను అనుకరిస్తూ నరసింహులు అనే యువకుడు ఈత రాక మృతి చెందాడు. ఈ సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

సంగారెడ్డికి చెందిన నరసింహులు , ప్రశాంత్ లు ఇద్దరు వరసకు అన్నదమ్ములు. వీరిలో సూరారంలో ఉంటున్న అన్న ప్రశాంత్ దగ్గరకు నర్సింహులు వచ్చాడు. ఇద్దరు సరదాగా..మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం దూలపల్లి గ్రామంలో ని తుమార్ చెరువుకు వెళ్లారు. చెరువు దగ్గరకు ఇద్దరు వెళ్లి ఫోన్ లో టిక్ టాక్ ను అనుకరిస్తూ నర్సింహా చెరువులో దిగాడు.

చెరువు గట్టుపై నుండి మరో యువకుడు వీరిద్దరిని  వీడియో చిత్రీకరిస్తుండగా నర్సింహ ఈత రాక గల్లంతయ్యాడు.దీంతో భయపడిన ప్రశాంత్ స్థానికులకు సమాచారం ఇచ్చాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రాత్రి కావడంతో మరుసటి రోజు గాలించి మృతదేహం ను వెలికి తీశారు. ఆ తర్వాత  పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొన్న పేట్ బషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates