ఫ్రెండ్స్ తో హోలీ ఆడాడు..అంతలోనే మృతి

ఖమ్మం : చెరువులో స్నానానికి వెళ్లిన ఓ యువకుడు శవమై తేలాడు. అప్పటివరకు ఫ్రెండ్స్ తో హోలి వేడుకల్లో పాల్గొన్నాడు. నలుగురు స్నేహితులతో కలిసి స్నానానికి దగ్గరలోకి చెరువుకు వెళ్లాడు. చెరువు లోతుగా ఉండటంతో వీరంతా మునిగిపోయారు. వారి అరుపులను గమనించిన స్థానికులు ముగ్గురిని కాపాడారు.  చెరువులో ఇంకాస్త లోపలికి వెళ్లిన మురళి (21)అనే యువకుడిని కాపాడలేకపోయారు. దీంతో మురళి చనిపోయాడని తెలిపారు అతడి ఫ్రెండ్స్. ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లా తిరుపాలాయపాలెం మండలం నేడిదపల్లి గ్రామంలో గురువారం మధ్యాహ్నం జరిగింది. హోలీ పండుగ తమ ఇంట్లో విషాదం నింపిందని కన్నీరుమున్నీరయ్యారు మృతుడి కుటుంబసభ్యులు.

 

Latest Updates