ప్రేయసి చున్నితో ప్రియుడు ఉరి

ప్రేమ పెళ్లికి తమ పెద్దలు ఒప్పుకోలేదని  ఓ యువకుడు తన ప్రేయసి చున్నితో ఉరి వేసుకున్నాడు.  ఈ ఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని రత్నాపూర్ పంచాయతీ పరిధిలో జరిగింది.  మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు డ్వాగ్ స్కాడ్ తో ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అయితే మంథని సీఐ చెప్పిన వివరాల ప్రకారం. ‘రాంపల్లి గ్రామానికి చెందిన శివరాత్రి అంజి  అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతి సంవత్సరం నుంచి ప్రేమించుకుంటున్నారు.  ఇద్దరు కలిసి ఏప్రిల్ 23 ఉదయం 9 గంటలకు బైక్ పై రామగిరి ఖిల్లాకు వెళ్లారు. అక్కడ ఇద్దరు  మాట్లాడుకుంటున్న సమయంలో అంజి.. తన ప్రేయసి చున్నితో ఉరి వేసుకున్నాడు. యువకుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో  ఘటనా స్థలానికి వెళ్లేలోగా చెట్టుపై మృత దేహం కుళ్లిపోయింది.  అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం ‘ అని చెప్పారు.

 

Latest Updates