టీ షర్ట్స్ ఆర్డర్ చేస్తే.. ఓటీపీ తో రూ.35,000 మాయం

హైదరాబాద్: ఆన్‌లైన్‌లో టీ షర్ట్‌లు ఆర్డర్ చేసిన యువకుడు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. నగరంలోని లాలాగూడ ప్రాంతానికి చెందిన యువకుడు ఓ వెబ్ సైట్ నుంచి రెండు టీ షర్ట్స్ ఆర్డర్ చేశాడు. అయితే డెలివరీ టైమ్ కి ఒక టీ షర్ట్ మాత్రమే రావడంతో సదరు వెబ్ సైట్ కస్టమర్ కేర్ కి కాల్ చేశాడు.

తాను ఆర్డర్ చేసిన విషయాన్ని ఆ కస్టమర్ కేర్ కి తెలుపగా.. వెబ్ సైట్ ప్రతినిధులు యువకుడికి మాయమాటలు చెప్పి ఓటీపీ నెంబర్ కనుక్కున్నారు. దాని ద్వారా యువకుడి అకౌంట్ లో ఉన్న రూ.35,000 మాయం చేశారు. తాను మోసపోయాయని గ్రహించిన యువకుడు  సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ వెబ్ సైట్ కస్టమర్ కేర్ విభాగంలో పనిచేసే జార్ఖండ్ కు చెందిన ఇద్దరు నిందితులు ఈ మోసానికి పాల్పడ్డారని విచారణలో తేలింది. వెంటనే వారిద్దర్నీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

 

Latest Updates