కటింగ్ షాప్ లో బిల్లు గొడవ : యువకుడు మృతి

హైదరాబాద్:  హైదరాబాద్ లో దారుణం జరిగింది. కటింగ్ చేయించుకునేందుకు వెళ్లిన ఓ యువకుడు సెలూన్ షాప్ యాజమానితో  డబ్బుల విషయంలో గొడవపడి ప్రాణాలు కోల్పోయాడు.

సైదాబాద్ పరిధిలోని కరణ్ బాగ్ కు చెందిన కార్తిక్ యాదవ్ అనే యువకుడు దగ్గరలో ఉన్న సెలూన్ లో  కటింగ్ చేయించుకున్నాడు. కటింగ్ చేసిన తర్వాత డబ్బులు ఇచ్చే విషయంలో సెలూన్ సిబ్బందికి  కార్తిక్ యాదవ్ కు మధ్య  గొడవ జరిగింది.  సెలూన్  యజమాని బాడీ బిల్డర్ తో పాటు  మరికొందరు వ్యక్తులు  కార్తీక్ యాదవ్ ను  అడ్డుకున్నారు. ఈ ఘటనలో కార్తీక్ యాదవ్ అక్కడిక్కడే  మృతి చెందాడు. అయితే ఉపిరి ఆడకపోవడంతోనే చనిపోయాడని కార్తీక్ బందువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కొరకు ఉస్మానియా ఆసుపత్రి తరలించారు.

 

Latest Updates