సులభంగా వచ్చే డబ్బు కోసం అక్రమ మద్యం కేసులో ఇరుక్కున్న యువకులు

కర్నూలు: సులభంగా వచ్చే డబ్బులకు ఆశపడిన యువకులు.. అక్రమ మద్యం కేసులో ఇరుక్కున్నారు. గోపాల్ దర్వాజ ప్రాంతానికి చెందిన కుమార్,  కృష్ణమూర్తి అనే ఇద్దరు యువకులు పక్కనే తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో మద్యం బాటిళ్లను కొని అక్రమంగా తుంగభద్ర నది దాటించి తీసుకొస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు.  ఏపీ కంటే తెలంగాణలో మద్యం ధరలు 50 శాతం వరకు  తక్కువ. ఇది గుర్తించి సులభంగా డబ్బు సంపాదన కోసం అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారని కర్నూలు వన్ టౌన్ సీఐ విక్రమ సింహ చెప్పారు. మేం నిరవధికంగా జరుపుతున్న దాడుల్లో పట్టుబడిన వారంతా 18 నుండి 25 ఏళ్ల లోపు వారే.. సులభంగా సంపాదించుకోవాలనే ఆశ వారిని క్రిమినల్ కేసుల్లో ఇరుక్కునేలా చేస్తోంది.. నూనూగు మీసాల యవ్వనంలో ఉన్న పిల్లలు తప్పుదోవ పడుతుండడం మంచిది కాదు.. దయచేసి తల్లిదండ్రులు మీ పిల్లల పట్ల శ్రద్ధ వహించండి..  సరైన నిఘా పెట్టండి.. డబ్బు సంపాదిస్తున్నారని తెలిస్తే..  ఎలా సంపాదిస్తున్నారనేది ఆరా తీసి నిర్ధారించుకుంటే మంచిదని సూచించారు సీఐ విక్రమసింహ.

Latest Updates