యువతిపై మద్యం సీసాలతో దాడి

ఇండిగో ఎయిర్ లైన్స్ లో పనిచేస్తున్న ఓ యువతిపై ముగ్గురు యువకులు మద్యం సీసాలతో దాడి చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలో జరిగింది. గత రాత్రి డ్యూటీ ముగించుకొని క్యాబ్ దిగి నడుచుకుంటూ వెళుతున్న ఆమెను బైక్ పై వచ్చిన ముగ్గురు పోకిరీలు వెంబడించారు. స్థానిక లిమ్స్ ఆసుపత్రి వద్దకు రాగానే ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. తమ వెంట తెచ్చుకున్న మద్యం బాటిళ్లలోని మద్యాన్ని ఆమెపై చల్లారు. దీంతో కంగారు పడిన యువతి గట్టిగా కేకలు వేయడంతో.. ఆ ముగ్గురు భయపడి ఆమెపై మద్యం సీసాలతో దాడి చేసి పారిపోయారు. ఈ దాడిలో యువతి స్వల్పంగా గాయపడింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

Latest Updates