హన్మకొండలో దారుణం..యువతి గొంతు కోసిన ఉన్మాది

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని రాంనగర్లో  దారుణం జరిగింది. ఓ యువతి గొంతు కొసి హతమార్చాడు ఓ ఉన్మాది. యువతికి తీవ్ర గాయాలవ్వడంతో అక్కడిక్కడే మృతి చెందింది.  హత్య చేసిన తర్వాత జడ్జిముందు లొంగిపోయాడు నిందితుడు. అతడిని పోలీసులకు అప్పగించాడు జడ్జి.

నిందితుడు షాహిద్  కాజీపేటకు చెందిన చైతన్య పురి కాలనీలోని ఓ మటన్ షాప్ లో పని చేస్తున్నట్లు గుర్తించారు. మృతురాలు లష్కర్ సింగారం గ్రామానికి చెందిన మునిగాల హరిత సాహితీగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హరిత, షాహిద్  మాస్టర్ జీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. కొంతకాలంగా వీళ్లు ప్రేమించుకుంటున్నారు. యువతి మరొకరితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో బ్లేడ్ తో గొంతు కోసి హతమార్చాడు షాహిద్.

Latest Updates