పెళ్లి పీటలెక్కాల్సిన చెల్లెలిపై అఘాయిత్యం.. అవమాన భారంతో ఆత్మహత్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. త్వరలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్యపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి,

పాల్వంచ పట్టణ పరిధిలోని జ్యోతి నగర్ కాలనీలో సప్పిడి వెంకటి – రాధమ్మ దంపతులు నివాసముంటున్నారు. ఇటివలే వారి చిన్న కూతురు భూమిక కు నిశ్చితార్థం జరిగింది. అయితే ఆమె తల్లిదండ్రులు భూపాలపల్లిలో ఓ వివాహ కార్యక్రమానికి వెళుతూ ఆమెను పాత పాల్వంచలోని తమ కొడుకు రాంబాబు ఇంట్లో ఉంచారు.

అదే రోజు రాత్రి రాంబాబు చెల్లెల్ని తీసుకొని తిరిగి జ్యోతి నగర్ లోని తల్లిదండ్రుల ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడే సొంత చెల్లిని బలత్కారం చేశాడని, ఆ అవమాన భారం తట్టుకోలేక ఆ యువతి పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో రోడ్డుపైకి వచ్చిందని స్థానికులు తెలిపారు.  వారు ఆమెను వెంటనే పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొంతుదూ భూమిక మృతి చెందింది.

భూమిక పై సొంత అన్న రాంబాబుతో పాటు అతని స్నేహితుడు కూడా బలాత్కారం చేశాడనే  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఖమ్మం జిల్లాలో తండ్రి కూతురు పై అత్యాచారం చేసిన సంఘటన మరువకముందే.. పాల్వంచ లో సొంత చెల్లి పై అన్న అత్యాచారం చేయడం.. కలకలం రేపుతోంది. దిశ, నిర్భయ ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా గాని ఇలాంటి కామాంధుల లో మార్పు రాకపోవడం, పైగా  రక్తసంబంధం,  వావి వరసలు మరిచిన ఇలాంటి కామాంధులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Latest Updates