మద్యం మత్తులో పోలీసులనే బెదిరించిన యువతి

మద్యం మత్తులో ఉన్న ఓ యువతి పోలీసులపై దాడి చేసింది. మీ అంతు చూస్తానంటూ పోలీసులకే వార్నింగ్ ఇచ్చింది. శనివారం రాత్రి లీసా అనే యువతి పూటుగా మ‌ద్యం సేవించి రోడ్డుపై పడి ఉండటాన్ని బంజారాహిల్స్ పోలీసులు గమనించారు. వెంటనే ఆ యువతిని స్టేషన్‌కు తీసుకువెళ్లారు. మెలకువ వచ్చిన తరువాత లీసా స్టేషన్‌లో హ‌ల్‌చ‌ల్‌ చేసింది. పోలీస్‌స్టేషన్ నుండి పారిపోయేందుకు లీసా ప్రయత్నించగా… మహిళా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఆ యువతి పోలీసులపై దాడికి దిగింది. వెంటనే పోలీసులు అప్రత్తమై ఆమెను గట్టిగా పట్టుకున్నారు. ఆమె వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. అంతు చూస్తానంటూ పోలీసులను లీసా బెదిరించింది. లీసా నాగాలాండ్ నుంచి వచ్చిందని, మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తోందని పోలీసులు తెలిపారు. లీసా డ్రగ్స్ తీసుకుందా? లేక మద్యం మత్తులో ఉందా? అన్న విషయాన్ని తేల్చేందుకు డాక్టర్ల చేత లీసాకు రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. లీసా తల్లిదండ్రులను పిలిపించి వారికి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

Latest Updates