ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బ‌స్సు ఢీకొని యువతి మృతి

హైద‌రాబాద్‌: రాజేంద్రనగర్ మండల పరిధిలోని మైలర్ దేవ్ పల్లి లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. బైక్ పై ప్ర‌యాణిస్తున్న మ‌హిళ‌ను ఆర్టీసీ బ‌స్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆమె అక్క‌డికక్క‌డే మృతి చెందింది. నేషనల్ పోలీస్ అకాడమీ ఎదురుగా రాఘవేంద్ర కాలనీ వద్ద ఈ ప్ర‌మాదం జ‌రిగింది. రోడ్డు పైన వెళ్తున్న బైకును వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ పైన వెనక కూర్చున్న మహిళ ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో బస్సు టైర్ ఆమెతల పైనుంచి వెళ్లింది . దీంతో ఆమె తల చిధ్ర‌మై అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. ఈ ఘటనకు ఆగ్రహించిన స్థానికులు బస్సు అద్దాలను పగులగొట్టారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ప్ర‌మాదం గురించి తెలుసుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు

Latest Updates