పెట్రోల్ అయిపోయిందని 100కి డయల్ చేస్తే..

ప్రయాణం మధ్యలో పెట్రోలు అయిపోయిందంటూ ఓ యువతి 100కు డయల్ చేస్తే స్పందించిన పోలీసులు పెట్రోలు తెచ్చి పోశారు. హైదరాబాద్‌లో జరిగిందీ ఘటన. మల్కాజిగిరికి చెందిన ప్రతిభ(22) అనే యువతి తార్నాకలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం(నైట్ షిఫ్ట్) చేస్తుంది. గురువారం రాత్రి 7:14 సమయంలో ఆఫీస్ కి వెళ్లే మార్గంలో తన స్కూటీలో పెట్రోల్ అయిపోవడంతో వెంటనే  డయల్ 100కు కాల్ చేసి ఉన్న విషయం చెప్పింది.  వెంటనే స్పందించిన పోలీసులు 7:30 కల్లా  పెట్రోలు బాటిల్‌తో యువతి వద్దకు చేరుకున్నారు. స్కూటీలో పెట్రోల్  పోసి జాగ్రత్తలు చెప్పి పంపించారు.  రాత్రి 8:30 ఆఫీస్ కు సేఫ్ గా చేరుకున్నట్టు ఆ యువతి ఫోన్ ద్వారా పోలీసులకు తెలిపింది.

young woman phoned to 100 as she stuck in middle of journey

 

 

Latest Updates