ప్రియుడి ఇంటి ముందు యువతి ధర్నా

తనను ప్రేమించి మరో యువతితో పెండ్లికి సిద్ధమయ్యాడని ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది ఓ యువతి. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్ కార్పోరేషన్ పరిధిలోని సాయిరాజా నగర్ లో నివాసం ఉంటున్న పి.గౌతమ్ అనే యువకుడు తిరుపతి నిర్మల (27) ని గత పది సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నాడు. తనను పెళ్ళి చేసుకుంటానని చెప్పి మరో యువతితో వివాహానికి సిద్దం కావడంతో సదరు యువతి తన బంధువులతో కలిసి యువకుడి ఇంటి ముందు ధర్నా కు దిగింది. తనకు న్యాయం జరిగేంత వరకూ ధర్నా ఆపబోనని యువతి తెలిపింది.

Latest Updates