స్నేహం పేరుతో నమ్మించి అత్యాచారం.. నలుగురు అరెస్ట్

మంచిర్యాల జిల్లా: దండేపల్లి మండల కేంద్రానికి చెందిన ఒక యువతిపై అత్యాచారం జరిగిందని , ఈ ఘటనలో శశి అనే యువకుడితో పాటు అతనికి సహకరించిన మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్టు పోలీసులు తెలిపారు. దండెపల్లి కి చెందిన యువతి(19సంవత్సరాలు) కి శశి అనే వ్యక్తికి మద్య స్నేహం వుంది. ఆ స్నేహం పేరుతో యువతిని నమ్మించి రామకృష్ణ పూర్ కి తీసుకెళ్లాడు ఆ యువకుడు. ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు.  అమ్మాయిని తీసుకురావడం లో మరో ముగ్గురు యువకులు సహకరించారని, వీరిలో ఒకరు మైనర్ బాలుడు కూడా ఉన్నాడని పొలీసులు చెప్పారు.

గత నెల ఫిబ్రవరి 27న  అమ్మాయి తండ్రి  తన కూతురు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడని, మిస్సింగ్ కేసు నమోదు చేసి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా మంచిర్యాల లో ఆ యువతి ఆచూకీ కనుగొన్నామని వారు చెప్పారు. జరిగిన దారుణం గురించి యువతి చెప్పిందని.. యువకులు కూడా విచారణ లో చేసిన నేరం ఒప్పుకోవడంతో వారిని రిమాండ్ కు తరలించినట్టు లక్షెట్టిపేట సీఐ నారయణ నాయక్ తెలిపారు. అయితే ఈ ఘటన పై యువతి కుటుంబ సభ్యులు మాత్రం ఎలాంటి  విషయాలు చెప్పలేదని ఆయన అన్నారు.

young-woman-raped-four-people-arrested-in-mancherial-district

Latest Updates