కరోనా నెగిటివ్..ఇంటికిరానియ్యని తల్లిదండ్రులు: యువతి ఆత్మహత్యాయత్నం

దమ్మపేట, వెలుగు: కరోనా నెగెటివ్ వచ్చినప్పటికీ తల్లిదండ్రులు ఇంటికి రానివ్వకపోవడంతో మన స్తాపంతో ఓ యు వతి ఆత్మహత్యకు యత్నించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పెద గొల్లగూడెంకు చెందిన యువతి ఉపాధి నిమిత్తం 2 నెలల క్రితం మహారాష్ట్ర వెళిం్లది. లాక్డౌన్తో అక్కడే చిక్కుకుపోయింది. ఇటీవల ఖమ్మం వచ్చిన ఆమెకు కరోనా టెస్ట్చేయ గా నెగెటివ్ రిపోర్ట్వచ్చింది. హోమ్ క్వారంటైన్లో ఉండాలని ఆమెకు సూచించి పంపించారు. దమ్మపేట మండలం గణేశుపాడు వద్దకు మంగళవారం సాయంత్రం చేరుకుంది. అక్కడ గ్రామస్తులు ఆమెను అడ్డుకున్నారు. విషయం తెలుసుకుని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకువెళ్లడానికి నిరాకరించారు. దాంతో గ్రామస్తులు, రెవెన్యూసిబ్బంది ఆమెను ఆశా వర్కర్ ద్వారా తిరిగి ఖమ్మం పంపించా లని నిర్ణయించారు.  మనస్తాపం చెందిన యువతి బహిర్భూమికని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. అదే సమ యానికి అక్కడకు చేరుకున్నఅశ్వారావుపేట సీఐ రా జగోపాల్ కు విషయం చెప్పడంతో చెరువు దగ్గ రకు వెళ్లారు. చెరువులో మునిగిపోతున్నయువతిని చూసిన సీఐ, కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి చెరువులోకి దిగి ఆమెను కాపాడారు. హుటాహుటిన సత్తుపల్లిప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు

Latest Updates