ఆన్ ‌లైన్ లోన్ వేధింపులకు మరో యువకుడు బలి

రాజన్నసిరిసిల్ల: ఆన్‌ లైన్ లోన్ వేధింపుల ఘటనలు ఇటీవల తరచూ చూస్తూనే ఉన్నాం. ఆన్‌లైన్ లోన్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుండ మండలం గాలిపల్లిలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్‌ లైన్‌ లోన్ వేధింపులు తాళలేక.. డిగ్రీ విద్యార్థి పవన్‌ కల్యాణ్(24) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

Latest Updates