మంధానకి ఫిదా అయిన యంగ్ క్రికెటర్

youngster-riyan-parag-reveals-mandhana_smriti-is-his-inspiration

స్మృతి మంధాన. చూడ చక్కని అందం. గ్లామర్ కు తగ్గట్టుగా స్టైలిష్ బ్యాట్స్ ఉమెన్. ఆటలోకి దిగిందంటే బౌండరీలు, సిక్సర్ల మోత మోగాల్సిందే. ఓ క్రికెటరే ఈ బ్యూటిఫుల్ మంధానకి ఫిదా అయ్యాడంటే దటీజ్ మంధాన క్రేజ్. అతడే 17 ఏళ్ల రాజస్తాన్‌ రాయల్స్‌ యంగ్ క్రికెటర్ రియాన్‌ పరాగ్‌. టీమిండియా ఉమెన్ స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధానకు వీరాభిమాని అంటూ తెలిపాడు.

“నా జీవితంలో మా నాన్నే నాకు తొలి ప్రేరణ. ఆ తర్వాత సచిన్‌, కోహ్లిలు. మహిళల క్రికెటర్లలో స్మృతి మంధాన ఆట అంటే నాకు ఎంతో ఇష్టం. తన బ్యాటింగ్‌ స్టైల్‌ను కాపీ కొట్టడానికి ప్రయత్నిస్తుంటాను. మ్యాచ్‌లో కళ్లద్దాలు పెట్టుకుని, BAS బ్యాట్‌ పట్టుకొని ఆడుతున్నప్పటి నుంచి ఆమె ఆటను నేను ఫాలో అవుతున్నాను. షాట్ల సెలక్షన్, క్రీజులో ఆమె కదలికలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి’ అంటూ 17 ఏళ్ల రియాన్‌ పరాగ్‌ తెలిపాడు.

ఈ ఐపీఎల్‌లో అద్భుత బ్యాటింగ్‌తో పాటు అవసరమైన దశలో బౌలింగ్‌తో రాణించిన రియాన్‌ పరాగ్‌పై అందరి దృష్టి పడింది.

Latest Updates