సూసైడ్ చేసుకోబోయిన యువతిని కాపాడిన పోలీసులు

హైదరాబాద్: కుటుంబ గొడవల కారణంగా సూసైడ్ చేసుకోవాలనుకున్న యువతిని తెలంగాణ పోలీసులు కాపాడారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ చెందిన ఒక అమ్మాయి ఇంట్లో గొడవలతో మనస్థాపానికి గురై సూసైడ్ చేసుకోవాలనుకుంది. ఇంట్లోంచి బయల్దేరిన ఆ యువతి గోదావరి బ్రిడ్జివైపు నడుచుకుంటూ రావడంతో.. అక్కడే చెక్ పోస్ట్ లో డ్యూటీలో ఉన్న ఎస్సెలు మంగిలాల్, విజేందర్ లు ఆమెను ప్రశ్నించారు. క్షణికావేశంతో ఇంట్లోంచి వస్తున్నట్లు గుర్తించి.. ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి పేరెంట్స్ కు అప్పగించారు. ఈ ఘటన ఫొటోలను రామగుండం కమిషనర్ ట్విట్టర్​లో పోస్ట్ చేయగా దీనిపై రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. ఎస్సైలిద్దరినీ మెచ్చుకున్నారు. విభేదాలు, అపార్థాలు విపరీతమైన భావోద్వేగాలకు దారితీస్తాయని, ఇది ఎవరికైనా ప్రమాదమేనని ట్వీట్​లో పేర్కొన్నారు. కొద్ది నిమిషాలు ఆలోచించడం సమస్యలకు పరిష్కారం చూపిస్తుందన్నారు.

Latest Updates