పేరెంట్సే మన ఫస్ట్ లవ్: వృద్ధాశ్రమంలో వాలంటైన్స్ డే

అహ్మదాబాద్: వాలంటైన్స్ డే.. ప్రపంచ వ్యాప్తంగా యువత సంబరంగా జరుపుకొనే ప్రేమ పండుగ.లవర్స్ కి రోజా పూలు, గిఫ్టులు ఇచ్చే వాళ్ల కొందరు.. స్పెషల్ టూర్లు ప్లాన్ చేసేవాళ్లు మరికొందరు. లవర్ కి ఎలాంటి సర్ ప్రైజ్ ఇవ్వాలా అని వారం ముందు నుంచే ఆలోచిస్తారు కొందరు యువతీ యువకులు. ప్రపంచంతో సంబంధం లేనట్లుగా చెట్టపట్టాలేసుకుని ఎగిరిపోతాయి ప్రేమ పక్షులు ఈ రోజు.

కానీ దీనికి భిన్నంగా గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన యువకుడు అన్సారీ లవర్స్ డేని కొత్తగా ప్లాన్ చేశాడు. ఎవరూ ఊహించని విధంగా వృద్ధాశ్రమంలో వాలంటైన్స్ డే వేడుకలు గ్రాండ్ గా చేశాడు. కేక్ కట్ చేసి అక్కడున్న పెద్దలతో సరదాగా గడిపాడు. వారితో ఆడి.. పాడాడు. కొందరు పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు ప్రేమ, ఆశీస్సులు అందుకున్నాడు. ప్రీ వాలంటైన్స్ డే పేరుతో నిన్న అహ్మదాబాద్ లోని ఓ వృద్ధాశ్రమంలో ఈ వేడుకలు నిర్వహించాడు అన్సారీ.

లవర్స్ డే సెలబ్రేషన్స్ ఇలా చేయడంపై మీడియా అడగ్గా… తల్లిదండ్రులే మన ఫస్ట్ లవ్ అని చెప్పాడు అన్సారీ. ఈ విషయాన్ని చాలా మంది మరచిపోతున్నారని, అందుకే తాను వాలంటైన్స్ డే వేడుకలకు వృద్ధాశ్రమాన్ని ఎంచుకున్నానని చెప్పాడు. మనం వేసుకునే దుస్తులు పాశ్చాత్య దేశాలవి కావచ్చు కానీ, మన థాట్స్ ఇండియావేనని అన్నాడు.

Latest Updates