నంబర్‌‌ 4 కోసమే నన్ను తీసుకున్నారు: శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌

నాగ్‌‌‌‌పూర్‌‌‌‌: వైట్‌‌‌‌బాల్‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌లో నాలుగో స్థానాన్ని భర్తీ చేసేందుకే టీమ్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ తనను తీసుకుందని శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ అన్నాడు. గత కొన్ని నెలల నుంచి మంచి పెర్ఫామెన్స్‌‌‌‌ చూపెట్టినందుకు సంతోషంగా ఉందన్నాడు. ‘నాలుగో నంబర్‌‌‌‌లో ఆడే అవకాశాన్ని మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ నాకు ఇచ్చిందని వ్యక్తిగతంగా అనుకుంటున్నా. కాబట్టి నమ్మకంతో ఆడాల్సిన అవసరం ఉంది. గత కొన్ని సిరీస్‌‌‌‌ల్లో నంబర్‌‌‌‌ 4 స్థానాన్ని బెంచ్‌‌‌‌మార్క్‌‌‌‌గా సెట్‌‌‌‌ చేయాల్సిన బాధ్యత నాపై ఉండేది. ఇప్పుడు ఈ ప్లేస్‌‌‌‌కు కాంపిటిషన్‌‌‌‌ బాగా పెరిగిపోయింది. బాగా ఆడి టీమ్‌‌‌‌లో ప్లేస్‌‌‌‌ను సుస్థిరం చేసుకోవడమే నా ముందున్న టార్గెట్‌‌‌‌’ అని అయ్యర్‌‌‌‌ వెల్లడించాడు. ఒకవేళ రోహిత్‌‌‌‌, కోహ్లీ విఫలమైనా.. అయ్యర్‌‌‌‌ మంచి ఫినిషర్‌‌‌‌గా ఉపయోగపడతాడని టీమ్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ బాగా నమ్మకం పెట్టుకుంది. దీనిపై మాట్లాడుతూ.. ‘కెప్టెన్‌‌‌‌, వైస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ త్వరగా ఔటైతే నేను చివరి వరకు బ్యాటింగ్‌‌‌‌ చేయాలి. నాలుగో నంబర్‌‌‌‌ బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌ రోల్‌‌‌‌ అదే. మూడో టీ20లో నేను చేసింది ఇదే. బాగా వర్కౌట్‌‌‌‌ అయ్యింది. టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ కోసం టీమ్‌‌‌‌లో చాలా కాంపిటిషన్‌‌‌‌ ఉంది. నేనైతే వేరే వాళ్ల గురించి ఆలోచించకుండా నాతోనే పోటీపడతా. నా పెర్ఫామెన్స్‌‌‌‌ బాగుంటే ప్లేస్‌‌‌‌ అదే దక్కుతుంది. ప్రస్తుతం నాలుగో నంబర్‌‌‌‌లో ఆడుతున్నా.. టీమ్‌‌‌‌ అవసరాలకు తగ్గట్టుగా ఏ స్థానంలో ఆడేందుకైనా నేను సిద్ధంగా ఉన్నా. ఒత్తిడిలోనూ బ్యాటింగ్‌‌‌‌ చేయగలననే నమ్మకం వచ్చింది. ఇదే ఫామ్‌‌‌‌ను కొనసాగిస్తే ఫ్యూచర్‌‌‌‌లో మరిన్ని అవకాశాలు కూడా వస్తాయి’ అని అయ్యర్‌‌‌‌ వ్యాఖ్యానించాడు.

Latest Updates