లాడ్జికి పిలిచి ప్రియురాలి గొంతుకోశాడు

చైతన్యపురిలో ఉన్మాది కిరాతకం

కత్తితో కోసుకుని ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్ నగరంలోని చైతన్య పురి లో దారుణం జరిగింది. చైతన్యపురి పీఎస్ పరిధిలోని ఓ లాడ్జీలో ఓ  ఉన్మాది ప్రియురాలి గొంతుకోసి  ఆపై తానూ ఆత్మహత్య కు పాల్పడ్డాడు.  స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వారిలో..  ఆ ఉన్మాది నెల్లూరు కు చెందిన వెంకటేష్(22)గా,  అతని ప్రియురాలు హైదరాబాద్ బడంగ్ పేటకు చెందిన మనస్విని(22) గా గుర్తించారు.

వెంకటేష్ ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి తరలించారు.యువతి మనస్విని ని కొత్త పేట లోని ఓమ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది. చైతన్యపురి పరిధిలోని బృందావన్ లాడ్జి లో ఈ రోజు(మంగళవారం) ఉదయం 10 గంటలకు వెంకటేష్,మనస్విని రూమ్ తీసుకున్నారు. తర్వాత వారి మధ్య ఘర్షణ తలెత్తడంతో ఉన్మాది ఆమెపై కత్తితో దాడి చేశాడు. వెస్ట్ గోదావరి కి చెందిన మనస్విని కుటుంబం హైదరాబాద్ బడంగ్ పేట అల్మాస్ గూడ లో స్థిరపడింది.  ప్రస్తుతం మనస్విని బీటెక్ పూర్తి చేసి దిల్ సుఖ్ నగర్ లోని ఓ కోచింగ్ సెంటర్ లో శిక్షణ పొందుతుంది.ఆమె పరిస్థితి మాత్రం తీవ్ర విషమంగా ఉందటున్నారు వైద్యులు.

Latest Updates