ఆర్టీసీ డ్రైవర్ పై యువకుడి దాడి

కరీంనగర్ : ఆర్టీసీ డ్రైవర్ పై ఓ యువకుడు దాడి చేశాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో ఆదివారం జరిగింది. కరీంనగర్ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు కరీంనగర్ బస్టాండ్ నుండి హైదరాబాద్ వెళ్తుంది. అయితే కమాన్ దగ్గర తన బైక్ ని ఢీకొన్నాడని ఓ యువకుడు ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేశాడు.

డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనున్న పోలీసులు.. యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Updates