బేగంపేటలో మహిళపై యువకుడి దాడి

సికింద్రాబాద్‌: సైకో దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఓ మహిళ ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ లో జరిగింది. బేగంపేట్‌లోని పాటిగడ్డలో ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా సడెన్ గా వచ్చిన ఓ యువకుడు మహిళపై కత్తితో దాడి చేశాడు. మహిళ అరుపులు విని స్థానికులు అక్కడి చేరుకోవడంతో యువకుడు పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్‌ పెట్రోలింగ్‌ సిబ్బంది.. రక్తం మడుగులో పడిఉన్న మహిళను కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలం నుంచి పారిపోయిన నిందితుడు ఓ ప్రైవేటు బిల్డింగ్‌ ఎక్కి దాక్కున్నాడు.

స్థానికుల సాయంతో అతడిని గుర్తించిన పోలీసులు పట్టుకుని బేగంపేట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. గతంలో కూడా ఇతనిపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. సైకోగా తెలుస్తోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు డాక్టర్లు. సమాచారం అందుకున్న మహిళ తల్లిదండ్రులు కూతురు దగ్గరకు చేరుకుని కన్నీరుమున్నీరవుతున్నారు.

See Also:

పనిచేయకుంటే పదవులను ఊడదీస్తాం

కోతులు పోతేనే ఓట్లేస్తాం

సంకల్పమే ఆమెను గెలిపించింది: సర్పంచ్ గా 97 ఏళ్ల బామ్మ

Latest Updates