ఇదో తొక్క చాలెంజ్

ట్రెండ్‌కు తగ్గట్లు యువతలో పోకడలు మారుతున్నాయి. జిహ్వకో రుచి,పుర్రెకో బుద్ధి.. అన్నట్ లు చిత్రమైన చాలెంజ్‌లు పుట్టుకొస్తున్నాయి. వాటి వల్ల కలిగే నష్టం గురించి పట్టించుకోకుండా గుడ్డిగా స్వీకరిస్తున్నారు. కొందరు. ఈ క్రమంలో ఇప్పుడు #Shell On Challenge వైరల్‌ అవుతోంది. ఈ చాలెంజ్‌ ప్రకారం తొక్క తీయకుం డానే ఆహారాన్ని నమిలిమిం గేయాలి. విడ్డూ రమైన ఈ చాలెంజ్‌ గురిం చి ఇంకొన్ని విషయాలు మీకోసం..

అరటి పండు, కోడిగుడ్డు, ర్యాపర్లతో కూడిన చాక్లెట్ లు .. ఇలా ఏదైనా సరే పైన తొక్క మాత్రం అస్సలు తీయకూడదు. సహజ సిద్ధమైన–ప్రాసెస్డ్‌ ఫుడ్‌ అనే తేడా చూడకూడదు. చాలెంజ్‌ అంటే చాలెంజే. ప్రస్తుతం అమెరికన్‌ టీనేజి కుర్రాళ్లు ఎక్కువగా ఈ చాలెంజ్‌ను ఫాలో అయిపోతున్నారు. స్నాప్ చాట్‌ ట్రెండ్‌లో ‘షెల్ ఆన్ చాలెంజ్ ’ టాప్ లో కొనసాగుతోం ది. అయితే వైద్య నిపుణులు ఈ చాలెంజ్‌ గురించి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్‌ కడుపులోకి వెళ్తే ప్రాణాలకు ప్రమాదం ఉంటుందనే విషయాన్ని గమనించాలని యువతకు సూచిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ చాలెంజ్‌ వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగనప్పటికీ.. చిన్న పిల్లలు ఫాలో అయితే మాత్రం ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తల్లిదండ్రులకు జాగ్రత్త చెబుతున్నారు.

Latest Updates