చావుకు పోలీసులే కార‌ణ‌మంటూ వీడియో తీసి..

ఏపీ: త‌న చావుకు పోలీసులే కార‌ణ‌మంటూ ఓ యువ‌కుడు సెల్పీ వీడియో తీసి సూసైడ్ చేసుకున్నాడు. ఈ సంఘ‌ట‌న గురువారం చిత్తూరు జిల్లాలో జ‌రిగింది. ప్ర‌స్తుతం లాక్ డౌన్ క్ర‌మంలో అవ‌స‌ర‌ముంటేనే త‌ప్ప బ‌య‌టికి రావ‌ద్ద‌ని పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డే వాహ‌న‌దారులను హెచ్చ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే..చిత్తూరు జిల్లాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ప‌ని చేస్తున్న శ్రీనివాస్ అనే యువ‌కుడు బైక్ మీద కృష్ణా జిల్లాలోని త‌న సొంత గ్రామానికి బ‌య‌లుదేరాడు.

గుంటూరు జిల్లా బాప‌ట్ల ద‌గ్గ‌ర పోలీసులు శ్రీనివాస్ ను ఆపి , అత‌డి బైక్ ను సీజ్ చేసి బాప‌ట్ల బ‌స్టాండ్ లో వ‌దిలేశార‌ట‌. దీంతో త‌న మ‌న‌సు బాధేసింద‌ని మ‌న‌స్తాపంతో చ‌నిపోతున్నానంటూ ఓ సెల్ఫీ వీడియో తీశాడు. అందులో త‌న చావుకు పోలీసులే కార‌ణ‌మ‌ని.. తెలుపుతూ సూసైడ్ చేసుకున్నాడు యువ‌కుడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Latest Updates