
ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ’ల కోసం లేటెస్ట్గా యూట్యూబ్ కొత్త అప్డేట్ తీసుకొచ్చింది. యూట్యూబ్‌లో 8కె రెజల్యూషన్‌తో వీడియోలు చూసే అవకాశం కల్పించనుంది. ‘ఆండ్రాయిడ్ 10 ఓఎస్’, ఆపై వెర్షన్స్‌తో ఉన్న కొన్ని హైఎండ్ స్మార్ట్ టీవీలలో మాత్రమే ఈ ఫీచర్ పనిచేస్తుంది. ప్రస్తుతం 8కె రెజల్యూషన్ ఆఫర్ చేసే టీవీలు చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఖరీదైన టీవీల్లోనే. కానీ, ఈ రెజల్యూష్తో యూట్యూబ్‌లో వీడియో చూస్తే థియేటర్లో సినిమా చూసినంతటి ఎక్స్‌పీరియెన్స్ కలుగుతుంది. ‘లిమిటెడ్ 8కె సపోర్ట్ ఫర్ ఆండ్రాయిడ్ 10 అండ్ అప్’ అని యూట్యూబ్ అనౌన్స్ చేసింది. అయితే, ‘లిమిటెడ్’ అనే దానికి సంబంధించిన పూర్తి వివరాల్ని ఇంకా చెప్పలేదు. కానీ, ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఉన్న దాదాపు యాభైవేల రూపాయల ధర ఉన్న టీవీల్లో 8కె వీడియోస్ చూసే ఛాన్స్ ఉంది. దీనికోసం సెట్టింగ్స్‌లో మార్పులు చేయాలి. ఈమధ్య 8కె సపోర్ట్‌తో కెమెరాలు కూడా అందుబాటులోకి రావడంతో, చాలా వీడియోల్ని ఈ ఫార్మాట్లో తీస్తున్నారు. ఈ వీడియో ఫార్మాట్ అందరికీ అందుబాటులోకి వస్తే, యూజర్స్‌కు మరింత క్వాలిటీ వీడియోస్ చూసే ఛాన్స్ ఉంది.
ఆన్లైన్ యాక్టివిటీ ట్రాక్ చేయకుండా
ఆన్లైన్లో యూజర్స్ ఏం చేసినా గూగుల్ కనిపెట్టేస్తుంది. మీరు ఒక ప్రొడక్ట్ గురించి, ఏ యాప్‌లో సెర్చ్ చేసినా, తర్వాత నుంచి దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తుంటాయి. న్యూస్, జాబ్స్, షాపింగ్, ఇతర టాపిక్స్.. ఆన్లైన్లో యూజర్ల యాక్టివిటీని మొత్తం గుర్తిస్తుంది. దీనివల్ల చాలామంది యూజర్స్ తమకు ప్రైవసీ ఉండట్లేదనుకుంటారు. అయితే ‘ఆన్లైన్ యాక్టివిటీ’ని ‘గూగుల్’ ట్రాక్ చేయకుండా చేయొచ్చు. సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల గూగుల్ ట్రాకింగ్‌ను చాలావరకు తగ్గించుకోవచ్చు. సాధారణంగా లొకేషన్ దగ్గరినుంచి సెర్చింగ్, గూగుల్ రిలేటెడ్ యాప్స్ యాక్టివిటీస్ అన్నింటినీ గూగుల్ ట్రాక్ చేస్తుంది. ఇలా వద్దనుకుంటే సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకోవాలి. అయితే, ఇలా చేస్తే గూగుల్‌కు చెందిన కొన్ని పర్సనలైజ్డ్ ఫీచర్స్‌ను మిస్సయ్యే ఛాన్స్ ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్, ఐఫోన్, డెస్క్‌టాప్/ల్యాప్‌టాప్.. డివైజ్ ఏదైనా మీ గూగుల్ అకౌంట్ ట్రాక్ చేయకుండా చూడొచ్చు. ఏ డివైజ్‌లో అయినా గూగుల్ అకౌంట్లోకి వెళ్లి, మేనేజ్ యువర్ అకౌంట్ సెక్షన్‌పై క్లిక్ చేయాలి.
వెబ్ బ్రౌజర్లో అయితే ‘ప్రైవసీ అండ్ పర్సనలైజేషన్’ సెక్షన్‌కు వెళ్లి, ‘డాటా అండ్ ప్రైవసీ’పై క్లిక్ చేయాలి. దాని కింద ‘యాక్టివిటీ కంట్రోల్స్’లో ‘లొకేషన్ హిస్టరీ, యూట్యూబ్ హిస్టరీ’ వంటి సెక్షన్స్ కనిపిస్తాయి. వాటిపై క్లిక్‌చేసి, అన్నింటినీ ఆఫ్ చేయాలి. మీకు కావాల్సిన వాటిని అన్‌చెక్ లేదా ఆఫ్ చేసుకుంటే చాలు వెబ్‌బ్రౌజర్‌లో వీటిని గూగుల్ ట్రాక్ చేయలేదు.
ఆండ్రాయిడ్ ఫోన్లో సెట్టింగ్ యాప్‌లో ప్రైవసీ, లొకేషన్స్ సెక్షన్లోకి వెళ్లి కావాల్సిన వాటిని డిసేబుల్ చేసుకోవచ్చు. ఈ సెక్షన్లో కింద ‘యాప్ అండ్ యాక్టివిటీ’లో ‘లొకేషన్ హిస్టరీ, యూట్యూబ్ హిస్టరీ, యాడ్ పర్సనలైజేషన్, యాప్ పర్మిషన్స్’లో ట్రాక్ చేయకూడదనుకున్న వాటి పర్మిషన్స్ ఆఫ్ చేయాలి.
ఐఫోన్లో గూగుల్ యాప్‌లోకి వెళ్లాలి. యాప్ లేకుంటే డౌన్లోడ్ చేసుకుని, కుడివైపు పైన కనిపించే ‘మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్’పై క్లిక్ చేసి, తర్వాత ‘ప్రైవసీ అండ్ పర్సనలైజేషన్’ లేదా ‘డాటా అండ్ పర్సనలైజేషన్’పై ట్యాప్ చేయాలి. తర్వాత యాప్ కంట్రోల్స్లోకి వెళ్లి, లొకేషన్ హిస్టరీపై క్లిక్ చేసి, డిసేబుల్ చేసుకోవాలి. ఇతర యాప్స్, యాక్టివిటీస్‌ను ఇలాగే డిసేబుల్ చేస్తే వాటిని గూగుల్ ట్రాక్ చేయదు.