టిక్ టాక్ కు పోటీగా : ఇండియాలో అందుబాటులోకి వచ్చిన యూట్యూబ్ షార్ట్స్

వీడియోషేరింగ్ దిగ్గజం యూట్యూబ్ టిక్ టాక్ కు పోటీగా యూట్యూబ్ షార్ట్స్ అనే ఫీచర్ ను ఇండియాలో అందుబాటులోకి తెచ్చింది. 15సెకన్ల నిడివిగల వీడియోలో లక్ష ఆడియో ట్రాకుల్ని యాడ్ చేసినట్లు టెక్నాలజీ మీడియా సంస్థ ది వెర్జ్ కథనాన్ని ప్రచురించింది.
కథనం ప్రకారం యూట్యూబ్ షార్ట్స్ పేరుతో కొత్త ఫీచర్ ను యూట్యూబ్ కేవలం ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ లో అవకాశం కల్పిచ్చింది. త్వరలో ఐఓఎస్ లో కూడా లాంచ్ చేయనున్నట్లు యూట్యూబ్ స్పోక్ పర్సన్ వెల్లడించారు. టిక్ టాక్ తరహాలో షార్ట్స్ వీడియోస్, క్రియేటీవ్ వీడియోస్ ను షూట్ చేసుకునే అవకాశం ఉందని , త్వరలో మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నట్లు వెర్జ్ తన కథనంలో పేర్కొంది.

Latest Updates