ఉచితంగా యూట్యూబ్​ ఒరిజినల్స్

YouTube says forthcoming original series and specials will be free with ads

ఇటీవలే యూట్యూబ్​ ప్రీమియర్​ ప్లాన్స్​ ప్రారంభించిన సంగతి తెలిసిందే. చాలా షోలు, ఒరిజినల్స్​ను ఈ ప్లాన్  ద్వారా అందిస్తోంది యూట్యూబ్. సినిమాలు కూడా చూడొచ్చు. ఇప్పటివరకు ప్రీమియమ్​ మెంబర్స్​కు మాత్రమే అందిస్తున్న ఈ సేవల్ని త్వరలో అందరికీ ఉచితంగా అందించాలని నిర్ణయించింది యూట్యూబ్.  త్వరలో యూట్యూబ్​ నుంచి రానున్న కొన్ని ఒరిజినల్​ షోలు, సిరీస్​ వీడియోలను యూజర్లందరూ ఉచితంగా చూసే వీలుంది. అయితే వీడియోలతోపాటు యాడ్స్​ కూడా చూడాల్సి ఉంటుంది. యాడ్​లు ప్రసారం చేయడం ద్వారా ఉచితంగా వీటిని చూడొచ్చు. యూట్యూబ్​లో సూపర్​హిట్స్​గా నిలిచిన ‘కోబ్రా కే సీజన్ 1,2’,  ‘లేజర్  టీమ్’,  ‘లిజా ఆన్​  డిమాండ్’  వంటి ఒరిజినల్​ సిరీస్​లను కూడా యూజర్లు చూసే వీలుంటుంది. అయితే అన్ని సిరీస్​లను ఉచితంగా అందించట్లేదని, ఎంపిక చేసిన కొన్ని వీడియోలు మాత్రమే అందుబాటులో ఉంటాయని ‘యూట్యూబ్’ ప్రతినిధులు వెల్లడించారు. త్వరలో ‘లల్ల పలూజ’ మ్యూజిక్  ఫెస్టివల్​లైవ్​ స్ట్రీమింగ్​కు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది. ‘జస్టిన్​ బీబర్​తో ఒక ప్రాజెక్టు చేస్తున్నట్లు తెలిపింది.