సొంత నియోజకవర్గానికి బాబు చేసిందేమీ లేదు: జగన్

YS Jagan commenting on Chandrababu at Kuppam constitution

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి చేసింది శూన్యమని  వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ రోజు చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ఆయన…కుప్పం నియోజకవర్గాన్ని బీసీల నుంచి చంద్రబాబు లాక్కున్నారన్నారు. కుప్పం నియోజకవర్గానికి కనీసం ఒక డిగ్రీ కాలేజీ కూడా చంద్రబాబు తీసుకురాలేకపోయారన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే కుప్పం నియోజకవర్గం అభివృద్ది  చెందిందని జగన్ ఈ సందర్భంగా అన్నారు. తన సొంత నియోజకవర్గంలోని పూల రైతులను చంద్రబాబు ఆదుకోలేదన్నారు. కుప్పంలో ప్రైవేట్ మార్కెట్లు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలే కనిపిస్తున్నాయన్నారు. పంట నిల్వ చేద్దామన్నా కోల్డ్ స్టోరేజీలు లేవన్నారు. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి కుప్పంలో కేవలం 18వేల ఇళ్లే కట్టించారన్నారు.

Latest Updates