టీడీపీ,కాంగ్రెస్ వల్లే జమ్మలమడుగులో కక్షలు: జగన్

కడప: కాంగ్రెస్, టీడీపీ నాయకుల కుటుంబాల వల్లే జమ్మలమడుగులో  కక్షలు వచ్చాయని విమర్శించారు వైసీపీ అధ్యక్షుడు జగన్. ఇరు పార్టీల నాయకులు ఒకరినొకరు చంపుకున్న నాయకులు ఇప్పుడు వాళ్ల స్వార్థం కోసం మళ్లీ ఒక్కటయ్యారని విమర్శించారు. కడప జిల్లా జమ్మలమడుగులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన జగన్..  హత్యలు చేసేటటువంటి పెద్ద పెద్ద నాయకులు తనకు ఎవరు అండగా లేరని..నాన్న ఇచ్చిన కుటుంబమే తనకు అండగా  ఉందన్నారు. చంద్రబాబు చేనేత కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. చేనేత రుణ మాఫీ చేశాడా? ఇల్లు కట్టిస్తానన్నాడు కట్టించాడా? అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక బ్రాహ్మిణి స్టీల్ ప్లాంట్ ను తెరిపిస్తానని అన్నారు. చేనేత కుటుంబాలకు నవరత్నాలతో పాటు చేనేత కుటుంబానికి 24 వేలు ఇస్తామని హామి ఇచ్చారు . అగ్రి గోల్డ్ ఆస్తులను చంద్రబాబు ఆయన కుమారుడు, మంత్రులు బినామీలు గద్దల్లా దోచుకోవడానికి రెడీ అయ్యారని ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితులకు తొలి బడ్జెట్ రూ.1150 కోట్లు పెడతామని..మిగతా వారికి అగ్రి గోల్డ్ ఆస్తులు అమ్మి ఇస్తామన్నారు జగన్.

Latest Updates