YS జగన్ లండన్ పర్యటన రద్దు

YSRCP అధినేత జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన రద్దయింది. లండన్‌లో చదువుకుంటున్న కూతురును చూసేందుకు ఈరోజు కుటుంబ సమేతంగా లండన్ వెళ్లాల్సి ఉండగా.. జగన్ తన పర్యటనను సడెన్ గా రద్దు చేసుకున్నారు. జగన్ లండన్ పర్యటనపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతోనే ఆయన వెనక్కి తగ్గినట్టు సమాచారం.

ఫొని తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలు వణుకుతున్న టైమ్ లో జగన్ షెడ్యూల్ విమర్శలకు కారణమైంది. జనం సమస్యలు పట్టించుకోకుండా… జగన్ సినిమాలు చూస్తూ, పర్యటనల పేరుతో ఎంజాయ్ చేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. వైఎస్ జగన్ ఇటీవలే హైదరాబాద్ AMB మాల్ లో అవెంజర్స్ సినిమా చూశారు. తుఫాను టైమ్ లో జగన్ సినిమాకు వెళ్లడాన్ని చంద్రబాబు కూడా విమర్శించారు. ఈ పరిణామాల తర్వాత… జగన్ తన లండన్ పర్యటనను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది.

Latest Updates