తిరుమలలో బియ్యంతో జగన్ తులాభారం

తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామికి తులాభారం మొక్కు చెల్లించుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

ఈ సాయంత్రం 5 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్ పోర్టుకు వచ్చారు వైఎస్ జగన్.. మరో ఏడుగురు మంత్రులు. ఎయిర్ పోర్టునుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రత్యేక వాహనాల్లో తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. స్వామికి పట్టువస్త్రాలు పెట్టారు. ఆ తర్వాత తులాభారం మొక్కు చెల్లించుకున్నారు వైఎస్ జగన్. 80 కేజీల బియ్యంతో జగన్ తులాభారం మొక్కు చెల్లించారు.

ఆ తర్వాత పద్మావతి అతిథి గృహానికి వెళ్లారు జగన్. బేడి ఆంజనేయ స్వామి గుడిలోనూ.. పట్టువస్త్రాలు సమర్పించారు ముఖ్యమంత్రి.

ఆ తర్వాత రేణిగుంట ఎయిర్ పోర్టునుంచి తిరిగి రాజధానికి వెళ్లిపోయారు సీఎం.

Latest Updates